Chandrababu : నేడు మిర్చి రైతులతో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మిర్చి రైతులతో భేటీ కానున్నారు

Update: 2025-02-22 02:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మిర్చి రైతులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. గత కొంతకాలంగా మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడమే కాకుండా చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా మాట్లాడి వచ్చారు.

కీలక నిర్ణయాలు...

మిర్చి ఎగుమతులు లేకపోవడంతో ధర పతనం అయిందని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో గుంటూరు మిర్చియార్డులో కూడా రైతుల వద్ద నుంచి సరైన ధరకు కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల వైఎస్ జగన్ కూడా వచ్చి వారికి మద్దతు ఇచ్చి వెళ్లిన నేపథ్యంలో నేడు మిర్చి రైతులతో చంద్రబాబు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News