Chandrababu : వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
వైసీపీ ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ విషప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
వైసీపీ ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ విషప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.నాలుగేళ్లలో సగటున 36.71 లక్షల మె.ట ఎరువులు వాడాలనుకున్నాంమన్న సీఎం మరో పది రోజుల్లో 44,580 మె.ట యూరియా వస్తోందని తెలిపారు. గత పది రోజులో 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని, - కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని తెలిపారు.
యూరియా విషయంలో...
దారి మళ్లించిన రూ.3 కోట్ల విలువైన యూరియా స్వాధీనం చేసుకున్నామన్న చంద్రబాబు నాయుడు ఏ రైతుకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించామని చెప్పారు. సకాలంలో యూరియా, ఎరువులు సరఫరా చేయడమే మ లక్ష్యమని, ఎరువుల అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్టంలో నేరస్తులు ఎక్కువయ్యారని, ఆధార్ ద్వారా... ఎవరికెంత యూరియా కావాలో పంపిణి చేస్తామన్న చంద్రబాబు కృష్ణా జిల్లాలో యూరియా లారీని వైసీపీ నేత అడ్డుకొని వివాదం చేశారని, ఫేక్ రాజకీయాలు చేస్తే... ఎవరినీ వదిలిపెట్టబోమని చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.