Free Bus for Women : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం... ఇవి ఉంటే చాలు

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Update: 2025-08-15 12:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్త్రీశక్తి పథకంలో భాగంా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించే ముందు చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లు కూడా పాల్గొననున్నారు. ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకూ చంద్రబాబు బృం్దం ప్రయాణించింది. తమకు ఉచిత బస్సు ప్రయాణం అందచేసినందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

కోట్లాది మంది మహిళలకు...
రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుల వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు ప్రభుత్వం లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇకపై ఏ పనిమీద అయినా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం వీలుందని అన్నారు. ఐదు రకాల బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీలో ఉచిత బస్సులో ప్రయాణం చేయాలంటే మహిళలు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు వంటివి ఏవైనా చూపిస్తే చాలు ఉచిత ప్రయాణం అమలవుతుంది.


Tags:    

Similar News