Chandrababu : నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నేడు కృష్ణా జలాలకు జలహారతిని ఇచ్చి ఆహ్వానించనున్నారు. దీంతో పాటు పలు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. నిన్న కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న చంద్రబాబుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
పెట్టుబడుల కోసం...
నేడు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధఇ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో పాటు కుప్పం నియోజకవర్గానికి పెట్టుబడులపై కూడా పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. అనంతరం కుప్పం నియోజకవర్గం ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు.