Chandrababu : నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారలు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారలు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు శ్రీశైలం సమీపంలోని సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11 నుంచి 11:35 మధ్య మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
శ్రీశైలం చేరుకుని...
ఆ తర్వాత 11:50 నుంచి 12:10 గంటల వరకూ శ్రీశైలం జలాశయం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12:25 నుంచి 1:10 గంటల వరకూ నీటి వినియోగదారుల సంఘంతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అమరావతికి హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు