నేడు రాజ్యసభ పదవికి ఎవరన్న దానిపై క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు

Update: 2025-04-22 02:09 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి యూరప్ నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నేడు ఢిల్లీలోనే పలువురు కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రయోజనాలు, రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకుకేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతితో పాటు బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశముంది. 

ఢిల్లీలో చంద్రబాబు...
తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా చంద్రబాబు నాయుడు కలిసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన రాజ్యసభ పదవికి ఈ నెల 29వ తేదీతో నామినేషన్ గడువు ముగియడంతో ఆయన స్థానంలో ఎవరిని నిలబెట్టాలన్న దానిపై చంద్రబాబు బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు.


Tags:    

Similar News