Chandrababu : బనకచర్లపై చంద్రబాబు లేటెస్ట్ గా ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బుదర జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కుప్పంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేరన్నారు. తన కారు కింద పడిన సింగయ్యను తొక్కుకుంటూ వెళ్లి పక్కన పడేసిన వీరికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిందనితెలిసి కూడా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అవామానవీయంగా వ్యవహరించారన్న చంద్రబాబు సింగయ్య భార్యను పిలిపించుకుని ఆమెను బెదరించి రాజకీయాలు చేస్తున్నారన్నారు.
శవరాజకీయాలు...
ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తారని అన్నారు. రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఈసారిచిత్తూరులో మామిడి దిగుమతి ఎక్కువ కావడంతో ధరలు తగ్గాయని, దానిపై రైతులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారు. బనకచర్లప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, ఏడాదికి రెండు వేల టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని, వాటిలో 200 టీఎంసీలు వాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. తాము గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. తాను వ్యతిరేకించే వ్యక్తిని కానని, రెండు రాష్ట్రాలూ బాగుండాలన్నదే తన ఉద్దేశ్యమని చంద్రబాబు అన్నారు.