మంత్రి నారాయణపై చంద్రబాబు పెద్ద బాధ్యత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ పనులను మంత్రి నారాయణకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ పనులను మంత్రి నారాయణకు అప్పగించారు. ఆయనే అన్నీ బాధ్యతలను చూసుకోవాలని తెలిపారు. రాజధాని నిర్మాణం అంతా మంత్రి నారాయణ చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు అమరావతి నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని నారాయణకు టార్గెట్ విధించారు.
టార్గెట్ ఇచ్చి మరీ...
టార్గెట్ మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూనే కూటమి ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ లో మంత్రి నారాయణతో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక రాజధాని పనులు వేగంగా ప్రారంభించాలని మంత్రి నారాయణ సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.