చంద్రబాబు, పవన్ గంటసేపు సమావేశం.. ఇందుకేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు భేటీ అయ్యారు

Update: 2025-03-03 13:02 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు భేటీ అయ్యారు. అసెంబ్లీ హాలులో ఈ సమావేశం జరిగింది. గంటసేపు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో దానిపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై...
ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడుతో చెప్పినట్లు తెలిసింది. మిగిలిన నాలుగు సీట్లలో ఎవరెవరిని ఎంపిక చేయనున్నారన్న దానిపై కూడా ఇరునేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్సీ స్థానం కోరుకోవడం లేదని, త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నందున నాలుగు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించనున్నారు. దీంతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించడంపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.


Tags:    

Similar News