Chandrababu : వాళ్లందరికీ గుడ్ న్యూస్... ఇక కుర్చీ ఖాయమైందటగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు లేదా ఎల్లుండి పార్టీ నేతలకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు లేదా ఎల్లుండి పార్టీ నేతలకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది. ఈ నెల 15వ తేదీ ఉదయం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే పలు మార్లు నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన చంద్రబాబు మరోసారి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రేపు సాయంత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రకటన వెలువడే అవకాశముంది. ఇందుకోసం పార్టీ నేతలు కూడా కసరత్తులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ నెల 15వ తేదీలోగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జాబితాను పంపాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు.
ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా...
కేవలం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పంపిన జాబితా మాత్రమే కాకుండా ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా సేకరించి నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నామినేటెడ పోస్టులు కూడా మూడు పార్టీలకు పంచేందుకు చంద్రబాబు జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. టీడీపీకి ఇందులో ఎక్కువగా పోస్టులు దక్కనుండగా, ఆ తర్వాత జనసేన పార్టీకి, అనంతరం బీజేపీకి కూడా కొన్ని స్థానాలను కేటాయించనున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీల నుంచి కూడా నామినేటెడ పోస్టుల కోసం జాబితాను అడగ్గా వారు కొన్ని పేర్లను ఇచ్చినట్లు సమాచారం.
పదవులు దక్కని వారికి...
గత ఎన్నికల్లో పదవులు దక్కని వారితో పాటు, పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి వచ్చి పేర్లను టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జాబితాను వడపోసి చంద్రబాబుకు అందచేసినట్లు సమాచారం. చంద్రబాబు వడపోత పట్టిన తర్వాత రేపు సాయంత్రం లేదా పదిహేనో తేదీ ఉదయం నామినేటెడ్ పోస్టులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే ముందు ఈజాబితాను ప్రకటిస్తారని తెలిసింది. అందుకోసమే ఆయన ముఖ్యమైన నేతల పేర్లు మిస్ కాకుండా పార్టీ విజయం కోసం కష్టపడిన వారందరికీ పదవులు ఇవ్వనున్నారు.
అనేక పోస్టులు...
ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న 2028 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 491 సొసైటీలకు ఛైర్మన్ లతో పాటు 900 దేవాలయాలకు ఛైర్మన్లతో పాటు పాలకవర్గాన్ని కూడా నియమించాలి. మార్కెట్ కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. అయితే అన్నింటినీ భర్తీ చేస్తారా? లేక వీటిలోకొన్నింటిని మాత్రమే భర్తీ చేసి మరికొన్నింటిని హోల్డ్ లో పెడతారా? అన్నది మా్రం తెలియరాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేసి నేతలకు పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉణ్నారు. దీంతో రేపో, మాపో టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు అందించే అవకాశాలున్నాయి.