Chandrababu : జగనూ దమ్ముంటే అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల అంటే తెలియని నాయకులు కూడా వాటి గురించి మాట్లాడుతున్నాడని జగన్ పై అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. బయట కూర్చుని రప్పా రప్పా అంటూ సరిపోదంటూ ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో మెడికల్ కళాశాలల అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్
భూమి ఇచ్చిన వెంటనే...
భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజీ అయిపోదని, 17 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఒక్కటే పూర్తయ్యిందని చంద్రబాబు అన్నారు. గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులేసి వదిలేశారన్న ఆయన అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని తెలిపారు. మెడికల్ కాలేజీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత తమదేనని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఉనికి కోల్పోతోందన్న చంద్రబాబు వైసీపీ ఆఫీసులు మూసేసి సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు..తామ కాదని అన్నారు.
అందుకే బెండు తీశారంటూ...
వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. అసెంబ్లీకిరాకుండా రప్పారప్పా అంటూ రంకెలేస్తున్నారన్నారు. ఇక్కడ ఉన్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అని బెదిరింపులకు భయపడబోమని చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట, పులివెందులలో ప్రజలు మీ బెండు తీశారన్న చంద్రబాబు నాయుడు హింసా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా వచ్చిన తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీశక్తులకు, యువకిషోరాలకు వందనం అన్న చంద్రబాబు ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం ఓట్ల కోసం కాదు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభ అని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహించామని చెప్పారు.