Andhra Pradesh : నేడు గూగుల్ తో ఏపీ కీలక ఒప్పందం
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ కీలక ఒప్పందం ఈరోజు ఉదయం 10 గంటలకు హోటల్ తాజ్ మాన్ సింగ్ లో గూగుల్ తో ఒప్పందం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ, గూగుల్ సంస్థల ఎంవోయు కార్యక్రమంలో హాజరు కానున్నారు.
విశాఖను ...
మంత్రి నారా లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నగరంగా రూపొందించడంలో ఇది తొలి అడుగు అని చెబుతున్నారు. ఏపీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ , ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు అవసరమైన చర్యల్లో భాగంగా ఈ ఒప్పందం తోడ్పడుతుందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ పాల్గొంటారు.