Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం... కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలకమైన ప్రతిపాదనలతో పాటు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి వర్గం సమావేశంలో నేడు చర్చించి ఆమోదించనున్నారు. ముఖ్యంగా సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వర్గ సమావేశం ముందు ఉంచుతారు. దానిపై చర్చించి ఆమోదించనున్నారు.
భూ కేటాయింపులతో పాటు...
కొన్ని సంస్థలకు భూముల కేటాయింపులపై ఆమోదం కేబినెట్ తెలపనుంది. అలాగే ఎస్ఐపీబీ సమావేశం తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై కూడా నిర్ణయం తసీుకునే అవకాశముంది. దీంతో పాటు రాజకీయ పరమైన అంశాలపై కూడా మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించనున్నారు.