Andhra Pradesh : ఈ నెల 9న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 9వ తేదీన జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 9వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నెల 9న సచివాలయం మొదటి బ్లాకులో ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ఉత్తర్వల్లో పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుపై...
ముఖ్యంగా రాజధాని అమరావతి భూములకు సంబంధించి అదనంగా భూముల సేకరణపై కూడా మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే బనకచర్ల ప్రాజెక్టుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణ అభ్యంతరాలపై కేంద్ర జల సంఘానికి పంపాల్సిన నివేదికపై కూడా మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.