వచ్చే నెల 9న మంత్రి వర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 9వ తేదీన జరగనుంది.

Update: 2025-06-29 06:47 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 9వ తేదీన జరగనుంది. జులై 9న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు అభివృద్ధి పనులపై చర్చించే అవకాశముంది.

అన్నదాత సుఖీభవ పథకంపై...
దీంతో పాటు రాజధాని అమరావతి పనులకు సీఆర్డీఏ ఆమోదించిన పనులకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చర్చించి ఆమోదించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూమి కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.


Tags:    

Similar News