Andhra Pradesh : ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశానికి సంబంధించి అజెండాను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. శాఖల వారీగా వివరాలను తెలపాలని ఉత్వర్వల్లో కోరింది.
వారం రోజుల్లోనే...
ఈ నెల 3వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. తిరిగి వారంలోనే మళ్లీ సమావేశమవుతున్న కేబినెట్ కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించే అవకాశముంది. డీఏ కు కేబినెట్ కమిటీ ఆమోదం తెలపనుందని తెలిసింది.