ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 6వ తేదీన జరగనుంది

Update: 2025-01-23 11:52 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 6వ తేదీన జరగనుంది. ఈ మేరకు అధికారులు అజెండాను రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిసింది. ముఖ్యమంత్రి ఎం చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటు.. అమరావతి పోలవరం పురోగతిపై చర్చించే అవకాశం ఉంది.

దావోస్ నుంచి నేడు...
ఈరోజు దావోస్ నుంచి స్వదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయల్దేరనున్న సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి 12.15 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన బయలుదేరి విజయవాడకు చేరుకుంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News