Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలివే

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

Update: 2025-10-03 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చించనున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇరవై అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు.

మోదీ పర్యటన నుంచి...
ఇక ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవాశముంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు పై మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించడంతో నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. సీఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు పీ.హెచ్.సి. వైద్యుల సమ్మె, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకు రానున్నాయి. తాజా రాజకీయ పరిణామలపై కూడా చర్చించే అవకాశముంది. కాకినాడ, విశాఖ ప్రాంతంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్సుంది.


Tags:    

Similar News