Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. రెండు హామీల విధివిధానాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరగనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరనుంది. సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనేక అంశాలపై చర్చించిన అనంతరం వాటికి మంత్రి వర్గం ఓకే చెప్పనుంది. ప్రధానంగా సీఆర్డీఏ కింద రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న 37 వేల కోట్ల రూపాయల టెండర్లకు ఆమోదం కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనుంది.
కీలక అంశాలపై...
అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు బడ్జెట్ లో ఇప్పటికే నిధులు కేటాయించిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. విధివిధానాలు ఖరారు చేసేందుకు చర్చించే అవకాశముంది. ఇదే సమయంలో కొన్ని భూ కేటాయింపుల విషయంపై మంత్రి వర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.