Andhra Pradesh : ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది

Update: 2025-02-19 02:22 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నెల 20వ తేదీన ఢీల్లి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమం్తరి చంద్రబాబు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రామ్ లీలా మైదనంలో రేపు...
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ మిత్రపక్షాలకు చెందిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీని బీజేపీ దక్కించుకుంది. అది కూడా వన్ సైడ్ మెజారిటీతో సాధించిన విజయాన్ని అందరూ పంచుకునేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది.


Tags:    

Similar News