పవన్ కుర్చీ ఖాళీగానే.. సమావేశంలో అరుదైన దృశ్యం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. అయితే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు.

Update: 2025-02-06 06:57 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. అయితే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఆయన అనారోగ్యం కారణంగా మంత్రి వర్గ సమావేశానికిహాజరు కాలేదు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది.

జ్వరం కారణంగా...
అయితే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాకపోయినా ఆయన సీటును మాత్రం సమావేశంలో ఖాళీగానే ఉంచారు. పవన్ కల్యాణ్ సీట్ లో మరెవరూ కూర్చోలేదు. ఆయనకు కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.


Tags:    

Similar News