BJP : నేటి నుంచి మాధవ్ జిల్లాల పర్యటన
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేటి నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేటి నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం పార్టీని బలోపేతం చేసే దిశగా జిల్లాల పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు మాధవ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
నేడు కడపలో....
నేడు ఉదయం దేవుడి కడప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాధవ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాధవ్ నేతలకు సూచించారు.