Bhuvaneswari : మీ ప్రకటన మాకు ఇబ్బంది : పురంద్రీశ్వరి

భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్రరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు

Update: 2023-10-24 07:48 GMT

భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్రరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆమెకు వివరించారు. 4.42 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఏపీ బీజేపీకి ఇబ్బందికరంగా మారిందని పురంద్రీశ్వరి ఈ సందర్భంగా నిర్మలమ్మకు చెప్పినట్లు తెలిసింది. ఏపీ ఆర్థిక పరిస్థిితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు తెలిసింది. ఈ మేరకు మంత్రికి పురంద్రీశ్వరి వినతి పత్రం అందచేశారు.

మద్యం కుంభకోణం...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, లెక్కకు మించి అప్పులు చేస్తూ భవిష్యత్ లో ప్రజలపై భారం మోపేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. ఏపీలో బడ్జెట్ తో పాటు అకౌంటింగ్ విధానం కూడా అస్తవ్యస్తంగా ఉందన్న ఆమె మద్యం విషయంలో ఏపీలో పెద్ద కుంభకోణం జరిగిందని దాని ద్వారా వచ్చే ఆదాయం అకౌంట్ లోకి రావడం లేదని నిర్మలాసీతారామన్ కు ఫిర్యాదు చేశారు. దాదాపు ముప్పయి వేల కోట్ల రూపాయల ఆదాయానికి లెక్కలేవని, మద్యం టెండర్లపై దర్యాప్తు జరపాలని పురంద్రీశ్వరి కేంద్రమంత్రిని కోరారు.


Tags:    

Similar News