అసెంబ్లీ ప్రారంభం... టీడీపీ సభ్యుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు కార్యక్రమం చేపట్టారు

Update: 2022-03-17 03:46 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు కార్యక్రమం చేపట్టారు. సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరపాలని, విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజూ టీడీపీ సభ్యులకు ఇది అలవాటుగా మారిందని స్పీకర్ ఫైర్ అయ్యారు.

శాఖల వారీగా....
ప్రస్తుతం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. నేడు అసెంబ్లీలలో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు చేయనున్నారు. ఇంటి స్థలాల పంపిణీ స్వల్పకాలిక చర్చ జరగనుంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యనే సభను స్పీకర్ కొనసాగిస్తున్నారు.


Tags:    

Similar News