Andhra Pradesh : గ్రామాల్లో ఆలయనిర్మాణాలకు టీటీడీ నిధులు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గ్రామాల్లో ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది

Update: 2025-11-25 04:46 GMT

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గ్రామాల్లో ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలకు అవసరమైన నిధులను కేటాయించనున్నట్లు తెలిసింది. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయనుంది.

భజన మందిరాలను...
గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలను వేగంగా జరపడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయ నిర్మాణాలు, భజన మందిరాలను గ్రామాల్లో నిర్మించుకోవడానికి అవసరమైన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వనుంది. ఇందుకోసం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ గ్రామాల్లో ఉన్న ప్రజలను కోరింది.


Tags:    

Similar News