అనంతపురంలో కుండపోత వర్షం

అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో పట్టణంలోని అనేక కాలనీలు నీట మునిగాయి.

Update: 2025-05-15 04:19 GMT

అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో పట్టణంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. పెద్దయెత్తున వరద నీరు రావడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రజలను ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

కాలనీల్లోకి వరద నీరు...
నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షంతో అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీ ప్రజాశక్తి నగర్, రాప్తాడు మండలం కందుకూరు గ్రామ సమీపంలో ఉన్న సీపీఐ కాలనీలోకి వరద నీరు ప్రవేశించడంతో విద్యుత్తు సరఫరాను నిలిపేసిన అధికారులు ఇళ్లలో ఉన్న వృద్ధలు, వికలాంగులును బయటకు సురక్షితంగా తెచ్చారు. ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తుంది.


Tags:    

Similar News