Chandrababu : చిన్నారితో చంద్రబాబు ఆటలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. చిన్నారితో ఆడుకున్నారు

Update: 2025-08-23 04:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవలే రామ్మోహన్ నాయుడు, శ్రావణి దంపతులకు కుమారుడు జన్మించాడు. అక్కడ చిన్నారిని చూసిన చంద్రబాబు కాసేపు ఎత్తుకున్నారు.

కింజారపు కుటుంబానికి...
తన ఒడిలోకి చిన్నారిని తీసుకున్న చంద్రబాబు ఆటలాడుకోవడం కనిపించింది. చిన్నారిని చూసిన చంద్రబాబు కింజారపు వారసుడితో కాసేపు ఆటలాడిన అనంతరం వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. చిన్నారికి దీవెనలు అందించారు.ప్రస్తుతం చంద్రబాబు చిన్నారితో ఆటలాడుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


Tags:    

Similar News