విశాఖలో దగ్గుబాటి సంచలన కామెంట్స్.. చంద్రబాబుతో వైరం ఉంది కానీ?
విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది.
విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. దగ్గుబాటి, చంద్రబాబు ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. దాదాపు ముప్ఫయి ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్న తోడల్లుళ్లు ఇద్దరూ ఆలింగనం చేసుకోవడాన్ని ఆసక్తికరంగా అందరూ తిలకించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనకు, చంద్రబాబు కు మధ్య వైరం ఉందని అందరూ అనుకుంటారని, అందులో వాస్తవం ఉందని, అలాగని జీవితాంతం వైరంతోనే ఉండాలా? అని ప్రశ్నించారు.
అలాగని కలసి ఉండాలా?
ఎల్లకాలం పరుషంగా ఉండాలా? అంటూ ఆయన అన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుని ఆనందంగా ఉన్నానన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరం కలసి మెలసి ఉండటమే అందరికీ కావాల్సిందన్నారు. తన పుస్తకావిష్కరణకు పిలిచిన వెంటనే చంద్రబాబు రావడం సంతోషంగా ఉందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. తాను కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతున్నానని ఆయన తెలిపారు.