విడదల రజనీపై కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది.
మాజీ మంత్రి విడదల రజినిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో గత ప్రభుత్వంలో తనను వేధించిన అంశంలో విడదల రజినిపై కేసు నమోదు చేయాలని పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. పిల్లి కోటి పిటిషన్ పరిశీలించి చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో...
హైకోర్టు ఆదేశాలు నేపథ్యంలో విడదల రజినిపై చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. విడుదల రజనీ పై కేసు నమోదు కావడంతో ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంలో విడదల రజనీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.