Amith Shah : ఏపీలో విషయాలపై ఆరా తీసిన అమిత్ షా.. జగన్ గురించి కూడా
అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయనతో భేటీ అయ్యారు.
అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక అంశాలను కూడా అమిత్ షా ప్రస్తావించినట్లు సమాచారం. మధ్యలో జగన్ విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. జగన్ ఎక్కడుంటున్నారు? ఆయనకు ఎన్ని ప్యాలెస్ లు ఉన్నాయి? వంటి వివరాలను వీరిని అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు రానున్న ఎన్నికల్లో తిరిగి కూటమితోనే వెళ్లాలన్న చంద్రబాబు అనడంతో అందుకు అభ్యంతరాలు ఏముంటాయని అమిత్ షా ప్రశ్నించినట్లు సమాచారం.
రెండు గంటల పాటు ...
అమిత్ షా దాదాపు రెండు గంటల పాటు ఉండవల్లిలోని అమిత్ షా నివాసంలో గడిపారు. ఈ సంందర్భంగా అందరితో కలసి విందు చేశారు. అరటి ఆకులో భోజనం పెట్టిన వారిని చూసి ఇదేమిటని అడగ్గా ఇది తమ సంప్రదాయమని చంద్రబాబు వివరించారు. ఇదే సమయంలో ఇక్కడ భూముల ధరలు ఎలా ఉన్నాయి? అని కూడా అమిత్ షా ప్రశ్నించారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో భూమి విలువ పెరిగిందని, ఇక్కడ విలువ తగ్గిందని, విభజనకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయన చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించడంపై కూడా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలపగా, దానిన కాపాడుకోవాల్సిన ధర్మం అందరిపైనా ఉందని అన్నట్లు తెలిసింది.
ఎన్టీఆర్ కు భారతరత్న...
దీంతో పాటు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, ఆయనకున్న ఇమేజ్, మంచిపనులను ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. పురంద్రీశ్వరి కూడా అమిత్ షా కు ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని తాము గతంలో కేంద్రానికి వినతిని సమర్పించిన విషయాన్ని తెలిపారు. అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. దీంతో పాటు ఎన్నికల హామీల గురించి కూడా అమిత్ షా ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నామని, ప్రజల్లో సానుకూలత ఉందని, ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేశామని చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. అమిత్ షా వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు.