Ambati Rambabu : ట్వీట్ లో మరో బాంబు పేల్చిన అంబటి
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన CII సమ్మిట్ లో మన చిన్న కమ్మ కళ్యాణ్ గారు కనిపించలేదేoటబ్బా అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీంతో అంబటి రాంబాబుపై జనసేన నేతలు విమర్శలకు దిగారు.
జనసేన క్యాడర్ ఆగ్రహం...
పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి అంబటికి సిగ్గులేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబుకు వేరే పనిలేదని, పవన్ కల్యాణ్ మాత్రమే తరచూ విమర్శలు చేస్తుంటారని పవన్ అభిమానులతో పాటు జనసైనికులు మండి పడుతున్నారు. అయితే అంబటి రాంబాబు మాత్రం తన పంథాలోనే తాను వెళతానంటున్నట్లు వరసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.