18వరోజుకు చేరిన మహా పాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదాయత్ర నేడు 18వ రోజుకు చేరింది. ఏలూరు జిల్లాలో జరుగుతున్న యాత్రకు ప్రజలు అఖండ స్వాగతం పలుకుతున్నారు.

Update: 2022-09-29 03:07 GMT

అమరావతి రైతుల మహాపాదాయత్ర నేడు 18వ రోజుకు చేరుకుంది. ఏలూరు జిల్లాలో జరుగుతున్న ఈ యాత్రకు ప్రజలు అఖండ స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఉదయం దెందులూరు నియోజకవర్గం కొప్పలి నుంచి బయలు దేరి శ్రీరామవరం వరకూ పాదయాత్ర సాగుతుంది. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం బయలుదేరి పెరుగు గూడెం వరకూ పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు. పదిహేను కిలోమీటర్ల మేర ప్రయాణించాలన్నది ఈరోజు రైతులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అన్ని పార్టీలూ....
ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్రకు ప్రజలతో పాటు అన్ని పార్టీలూ మద్దతిస్తున్నాయి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్న ఈ యాత్రకు జిల్లాలో అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. అరసవిల్లి వరకూ కొనసాగుతున్న ఈ యాత్ర మరో నలభై ఐదు రోజుల పాటు సాగనుంది. రైతులకు మద్దతుగా టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యునిస్టు పార్టీలు కూడా కలసి ఆ యా ప్రాంతాల్లో తమ మద్దతును ప్రకటించి వారి వెంట నేతలు నడుస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News