Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులు అవుతుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులు అవుతుంది. అయినా ఆయన ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. కేసుల మీద కేసులు ఆయనపై వరస పెట్టి పెడుతున్నారు. అందుకోసమే బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంలో ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న అరెస్ట్ చేశారు. అంటే నేటికి వల్లభనేని వంశీ అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులవుతుంది. కొన్ని కేసుల్లో బెయిల్ వస్తున్నా మరికొన్ని కేసుల్లో మాత్రం బెయిల్ లభించడం లేదు. అందుకే ఆయన విజయవాడ జిల్లా జైలులోనే మగ్గిపోతున్నారు.
మరో రెండు పీటీ వారెంట్లు...
తాజాగా వల్లభనేని వంశీపై మరో రెండు పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. వారెంట్లపై నేడు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం నిర్ణయాన్ని వెలువరించనుంది. కేవలం సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులతో పాటు గన్నవరం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్స్ అక్రమ తవ్వకాలపై కూడా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. వీటికి తోడు భూ కబ్జాల ఆరోపణలపై కూడా వంశీపై అనేక కేసులు నమోదు కావడంతో ఒక దాంట్లో బెయిల్ వస్తే మరొక కేసు మెడకు చుట్టుకుంటుంది.
ఫిబ్రవరి 13న...
వైసీపీ అధికారంలో ఉండగా వల్లభనేని వంశీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంగా ఉన్న కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తుందని ముందే తెలిసినప్పటికీ ఇలా వరస కేసులు వచ్చిపడతాయని ఊహించలేదు. సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఇక ఫిబ్రవరి 13న పకడ్బందీగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గన్నవరం నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అక్కడే మకాం వేశారు. అయితే పోలీసులు మాత్రం అన్నికోణాల్లో ఆలోచించి వరస కేసులు నమోదవుతుండటంతో ఇప్పట్లో వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
వరసకేసులు...
తాను వేసిన సింగిల్ బ్యారక్ కాదని, అందరిలోనూ కలిపి ఉంచాలని, బయట నుంచి ఆహారాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని వల్లభనేని వంశీ గతంలో న్యాయస్థానాన్నిఆశ్రయించారు. అదే సమయంలో మిగిలిన ఖైదీలతో పాటు తనను ఉంచాలని కూడా కోరారు. తనకు ప్రాణభయం ఉందని కూడా వల్లభనేని వంశీ చెప్పారు. అయితే వరసగా కేసులు నమోదవుతుండటం, ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులు అన్నీ సిద్ధం చేస్తన్నారు. అందుకే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేందుకు ఛాన్స్ లేదు. ఇంకా బెజవాడలోని మండుటెండలకు మరికొద్ది కాలం జైలులోనే ఉండి పోవాల్సి పరిస్థితులు ఉన్నాయంటున్నారు.