నేడు తిరుపతిలో కూటమి నేతల సమావేశం
తిరుపతిలో కూటమి నేతలు, హిందూపరిషత్ సభ్యులు సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం ఒక ప్రయివేటు హోటల్ లో సమావేశం కానున్నారు
ys jgans tour in tirumala
తిరుపతిలో కూటమి నేతలు, హిందూపరిషత్ సభ్యులు సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం ఒక ప్రయివేటు హోటల్ లో సమావేశం కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అందరూ సమావేశమై జగన్ తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ను సమర్పించేలా చూడాలని ఈ సమావేశంలో కోరనున్నారు.
తిరుమలకు వస్తే...
ఇప్పటికే బీజేపీ నేతలు, స్వామీజీలు జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ ఈవోకు వినతి పత్రాన్ని అందచేశారు. మరో వైపు అలిపిరి వద్దనే డిక్లరేషన్ ఇవ్వాలని, లేకుంటే జగన్ పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ప్రారంభమయ్యే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పోలీసులు కూడా ఎవరూ ప్రదర్శనలు, ఆందోళనలు చేయవద్దని, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని చెబుతున్నారు.