చిరంజీవికి కొత్త ఐడీ కార్డు

మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ సభ్యుడిగా గుర్తిస్తూ కొత్త ఐడీ కార్డును ఏఐసీసీ జారీ చేసింది.

Update: 2022-09-21 12:11 GMT

మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ డెలిగేట్‌ గా  గుర్తిస్తూ కొత్త ఐడీ కార్డును ఏఐసీసీ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తరుపున ఈ కొత్త ఐడెంటిఫికేషన్ కార్డును ఏఐసీసీ జారీ చేసింది. 2027వ సంవత్సరం వరకూ కాంగ్రెస్ డెలిగేట్‌ గుర్తిస్తూ ఏఐసీసీ ఈ కార్డును విడుదల చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవిని పీసీసీ డెలిగేేట్ గా ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా ౯ వేల మంది డెలిగేట్లను కాంగ్రెస్ ఎంపిక చేసింది. అందులో చిరంజీవి ఒకరు.

నిన్న ఆడియోతో....
నిన్ననే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఆడియోను విడుదల చేశారు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అన్న ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆడియో వైరల్ అయిన మరుసటి రోజే కాంగ్రెస్ ఐడీ కార్డు విడుదల చేయడం విశేషం.


Tags:    

Similar News