Ys Jagan : సుదీర్ఘకాలం తర్వాత నేడు అసెంబ్లీకి జగన్
సుదీర్ఘకాలం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు
సుదీర్ఘకాలం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతానని చెప్పి దూరంగా ఉండిపోయారు.
తనతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు...
తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి దూరంగా ఉంచారు. అయితే అరవై రోజులు దాటితే చర్యలు తప్పవని స్పీకర్ చేసిన హెచ్చరికలతో నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. గవర్నర్ ప్రసంగం కావడంతో సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి జగన్ వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.