Andhra Pradesh : కల్తీ మద్యంపై వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు.
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రాలను అందించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని, పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని నినాదాలు చేశారు. వైసీపీ కేంద్రపార్టీ కార్యాలయం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యంపై నిరసనలు చేపట్టింది. కల్తీ మద్యంతో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పోతున్నాయని వైసీపీ నేతలు అన్నారు.
బెల్ట్ షాపులను అరికట్టడంలో...
కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని తెలిపారు. బెల్ట్ షాపులను నిరోధించడంలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. రాష్ట్రమంతటా మద్యం ఏరులైపారుతుందని వారు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో నిరసన ర్యాలీలు చేపట్టి కల్తీ మద్యానికి ప్రజలు దూరంగా ఉండాలంటూ వైసీపీ నేతలు పిలుపు నిచ్చారు.