Breaking : కింగ్ పిన్ అద్దేపల్లి జనార్థన్ అరెస్ట్

కల్తీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-10-10 13:03 GMT

కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తంబళ్ల పల్లి నియోజకవర్గంలోని ములకలచెరువులో ప్లాంట్ పెట్టి మరీ కల్తీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

గన్నవరం ఎయిర్ పోర్టులో...
అయితే కల్తీ మద్యం కేసులో కింగ్ పిన్ అద్దేపల్లి జనార్థన్ విదేశాల్లో ఉండటంతో ఆయన కోసం వేచి చూస్తున్నారు. అయితే తాను నిర్దోషినని, త్వరలోనే వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతానని వీడియో రిలీజ్ చేశాడు. జనార్థన్ ఆఫ్రికా నుంచి భారత్ కు చేరుకుని హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అద్దేపల్లి జనార్థన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వస్తున్నారని ముందస్తు సమాచారంతో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తసీుకున్నారు.


Tags:    

Similar News