అన్యాయంగా ఇరికించారు : రాజ్ కేసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట తెలిపారు. ఫామ్ హౌస్ లో ఉన్న పదకొండు కోట్ల రూపాయలు తనకు సంబంధించినవి కావని ఆయన తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల పేర్లను కూడా తాను ఇప్పుడే వింటున్నానని అన్నారు.
రిమాండ్ పొడిగింపు...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. సెప్టంబరు 3వ తేదీ వరకూ నిందితులు పన్నెండు మందికి రిమాండ్ విధించింది. ఈ కేసులో అరెస్టయిన పన్నెండు మంది నిందితుల రిమాండ్ నేటితో పూర్తి కావడంతో అందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండ్ ను పొడిగించారు.