నేడు మిధున్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కస్టడీ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కస్టడీ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ లో మిధున్ రెడ్డిని విచారించాల్సి ఉందని, తమకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆయన గత యాభై రోజులకు పైగానే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిధున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనున్న సందర్భంలో కస్టడీకి కోరుతూ సిట్ పిటీషన్ దాఖలు చేయడంతో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.