ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటీషన్ విచారణ నేడు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరగనుంది. రాజ్ కేసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై నేడు విచారణజరగనుంది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఏడుగురిని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు అరెస్ట్ చేశారు.
కస్టడీలోకి తీసుకుని
వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. సిట్ అధికారులతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించారు. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంతో తమకు బెయిల్ ఇవ్వాలంటూ వారు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించి న్యాయస్థానం నిర్ణయం ప్రకటించే అవకాశముంది.