మిధున్ రెడ్డి పిటీషన్లపై నేడు విచారణ

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పిటీషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరగనుంది

Update: 2025-07-22 02:34 GMT

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పిటీషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరగనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తనకు జైల్లో అన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతించాలని, వారంలో ఆరు ములాఖత్ లకు అవకాశం కల్పించాలని మిధున్ రెడ్డి పిటీషన్లు వేశారు.

ప్రత్యేక వసతులు...
దీంతో పాటు తనకు కేటాయించిన రూంలో టీవీని ఏర్పాటు చేయాలని కూడా మిధున్ రెడ్డి పిటీషన్ వేశారు. దీనిపై నేడు న్యాయస్థానం విచారించిన తర్వాత జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది. అయితే వీఐపీకి సంబంధించిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఇప్పటకే ప్రభుత్వం తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. జైలు అధికారి కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు.


Tags:    

Similar News