YSRCP : బ్యాలట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి
వైసీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసింది. ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పింది
వైసీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసింది. ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పింది. అందుకు గత ఎన్నికల్లో లభించిన ఆధారాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎదుట ఉంచింది. గత ఎన్నికల్లో ఈవీఎంలలో లోటుపాట్లు ఉన్నాయని, పోలింగ్ శాతంపై కూడా ఎన్నికల అధికారులు కావాలని కొన్ని రోజులు గోప్యంగా ఉంచారని ఫిర్యాదు చేసింది.
చివరి నిమిషంలో...
చివరి నిమిషంలో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడంతో పాటు అసాధారణంగా ఓటర్లు పెరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలయిన ఓట్లకు వీవీ ప్యాట్లతో సరిపోల్చి చూడాలని చెప్పామన్నారు. ఏపీలో సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ శాతం పెరగడం అనేక అనుమానాలకు తావిస్తుందని కూడా చెప్పినట్లు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు.