ఆలయ హుండీలో వజ్రం.. దానితో పాటు ఓ లేఖ
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఒక వజ్రం కనిపించింది.
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఒక వజ్రం కనిపించింది. 1.39.6 క్యారెట్ల ముడి వజ్రంగా అధికారులు గుర్తించారు. ఈ వజ్రంతో పాటు ఒక లేఖను కూడా కనుగొన్నారు. భక్తుడు ఆ వజ్రాన్ని స్వామివారి ఆభరణాల కోసం వినియోగించాలని ఆ లేఖలో కోరారు.
దేవాదాయ శాఖ ఆధికారులు హుండీ లెక్కింపును చేపట్టగా వజ్రాన్ని గుర్తించారు. తనకు వజ్రం దొరికిందని.. నిజమైనదని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేస్తున్నట్లు తెలిపారు. వజ్రాన్ని రాజంపేట దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్, ఆలయ ఈవో కొండారెడ్డిలు ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామికి అప్పగించారు. ఆ వజ్రాన్ని ఏం చేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.