మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని.. జిల్లా కలెక్టర్ ఆగ్రహం
వైద్యులు బాలికను పరీక్షించి.. గర్భవతి అని నిర్థారించారు. కొద్ది నిమిషాలకే సదరు బాలిక..
9th class student gave birth to baby boy
ఇటీవల కాలంలో కొందరు విద్యార్థినులు స్కూళ్లు, కాలేజీలలోనే ప్రసవించేస్తున్నారు. వారిని చూసి షాకవ్వడం టీచర్లు, తల్లిదండ్రుల వంతవుతుంది. తాజాగా.. కడప జిల్లా వాల్మీకిపురంలో ఉన్న గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఒక బాలికకు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో.. ఆస్పత్రికి తరలించగా.. ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
శనివారం సాయంత్రం బాధిత బాలికకు కడుపునొప్పి వచ్చింది. ఎంతసేపటికీ తగ్గకపోగా.. మరింత తీవ్రమవడంతో ఆమెను పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలికను పరీక్షించి.. గర్భవతి అని నిర్థారించారు. కొద్ది నిమిషాలకే సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ ఫిరోజ్ ఖాన్, ఎస్సై బిందుమాధవి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. బాలికను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాలిక గర్భానికి కారణం ఆమె మేనమామేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.