మంగళగిరిలో 2.35 కోట్లతో వినాయకుడు
మంగళగిరిలో 2కోట్ల 35 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో గణపతి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
మంగళగిరిలో 2కోట్ల 35 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో గణపతి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మంగళగిరి మెయిన్ బజార్‌లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి మండపాన్ని ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. సంక బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ వినాయకుడిని సిద్ధం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది 2.30 కోట్ల కరెన్సీ నోట్లతో స్వామి వారిని అలకరించారు. ఈ ఏడాది మరో ఐదు లక్షల రూపాయలను అదనంగా జోడించి 2.35 కోట్ల రూపాయల నోట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పది, ఇరవై, యాభై, వంద, రెండు, ఐదు వందల నోట్లను ఇందుకోసం ఉపయోగించారు.