Andhra Pradesh : నేడు ఏపీ శాసనసభ అజెండా

ఆంద్రప్రదేశ్ శాసన సభ 11వ రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి

Update: 2025-03-13 02:30 GMT

ఆంద్రప్రదేశ్ శాసన సభ 11వ రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసన మండలి పదవ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ఆయా శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ జరిపి ఆమోదం తెలపనున్నారు.

స్వల్పకాలిక చర్చలు...
2024 ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకము సవరణ బిల్లు*ను రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. శాసన సభలో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల మార్పు, రాష్ట్రంలో వలసలు...బిల్లుల చెల్లింపులో అక్రమాలు, ఆంధ్ర విశ్వ విద్యాలయాలలో అక్రమాలు..విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. - ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ ఉంది. శాసనమండలిలో మాత్రం - 2019- 2024 మధ్య జరిగిన కుంభకోణాలు పై శాసన మండలిలో లఘు చర్చ జరగనుంది.


Tags:    

Similar News