Andhra Pradesh : నేటి నుంచి సచివాలయ సిబ్బంది బదిలీల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Update: 2025-11-21 04:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు స్పౌస్ కోటా కింద కూడా బదిలీలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. బదిలీల కోసం దరఖాస్తులను ఆన్ లైన్ లో నవంబర్ 24 వ తేదీ వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తులను ఈ నెల 25, 26 తేదీల్లో పరీశీలిస్తారు.

ఈ నెల 29వ తేదీ లోపు...
దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. అనంతరం ఈ నెల 29వ తేదీన బదిలీ ఉత్తర్వులు జారీ కానున్నాయి. సచివాలయం కేటాయింపు నవంబర్ 29 లోపు పూర్తి అవుతుంది. సచివాలయం ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొత్తం నవంబర్ 30 లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.


Tags:    

Similar News