Breaking : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారయింది.
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారయింది. వచ్చే ఏడాది జులై 23వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ పుష్కరాలను నిర్ణయించింది. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన పనులు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని భఆవిస్తుంది. ముందస్తుగానే గోదావరి పుష్కరాలకు నిధులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకుంది.
నిధులు కేంద్రం నుంచి...
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందు రైల్వే శాఖ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆదునికీకరణ పనులకు 271.43 కోట్లు రైల్వే శాఖ కేటాయించింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. పుష్కర ఘాట్లను ఎక్కువగా ఏర్పాటు చేసి భక్తులు ఎక్కువ సంఖ్యలో పుణ్య స్నానాలు చేసేందుకు వీలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.