నేడు పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం సోమవారం నుంచి మూడ్రోజుల పాటు పర్యటించనుంది

Update: 2026-01-19 06:01 GMT

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం సోమవారం నుంచి మూడ్రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో కేంద్ర జల సంఘం అధికారులు కూడా పాల్గొంటారు. కమిటీ ప్రాజెక్టులోని గ్యాప్ 1, D హిల్, G హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను, మెయిన్ డ్యామ్‌లోని గ్యాప్ 2, మెటీరియల్ నిల్వలను, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలించనుంది. పోలవరం ప్రాజెక్ట్ చేరుకున్న విదేశీ నిపుణుల బృందానికి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు.

పరిశీలన తర్వాత...

బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకో ఉన్నారు.వీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఆరో విడత పర్యటిస్తున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని నిపుణుల బృందానికి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఏం ఈ ఐ ఎల్ ప్రతినిధులు వివరించారు. నేడు గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జి హిల్, ప్రధాన డాం ఎగువ, దిగువ భాగాలు, డి వాల్ , డీ వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్ నిపుణుల బృందం పరిశీలించనుంది


Tags:    

Similar News